భారతదేశం, మార్చి 28 -- TG Contract Employees: ప్రభుత్వ సర్వీస్‌లో రిటైర్మెంట్‌ తర్వాత కూడా కుర్చీలు వదలకుండా పెన్షన్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాల్లో జీతాలు తీసుకుంటున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జుళిపించింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలని ఆదేశిస్తూ చీఫ్‌ సెక్రటరీ శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగుల్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీరంతా ఇంటి బాట పట్టనున్నారు. ఒక్క మునిసిపల్ శాఖలోనే 177మంది ఉద్యోగులపై వేటు వేశారు. కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకోవాలంటే నోటిఫికేషన్లు ఇచ్చి నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల్లో పాతుకుపోయిన వారంతా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత...