భారతదేశం, ఏప్రిల్ 16 -- Tesla layoffs today : ప్రపంచవ్యాప్తంగా 'లేఆఫ్​' ప్రక్రియ మళ్లీ ఊపందుకుంటున్న వేళ.. టెస్లా నుంచి ఒక ఆందోళనకరమైన వార్త బయటకు వచ్చింది. భారీగా ఉద్యోగులను తొలగించేందుకు దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా సిద్ధపడింది. సంస్థలోని కనీసం 10శాతం, అంటే 14వేల మంది ఉద్యోగాలను టెస్లా తొలగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సంస్థ ఉద్యోగులకు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ఇప్పటికే ఈ-మెయిల్స్​ చేశారట.

ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో కనీసం 14వేల మందిని తొలగించేందుకు ఎలాన్​ మస్క్​ సిద్ధపడ్డారు. 'రోల్స్​ డూప్లికేషన్​' ఇందుకు కారణం అని వివరించారు.

"కంపెనీ.. మరో దశ వృద్ధికి రెడీ అవుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రొడక్టివిటీని పెంచేందుకు.. అన్ని అంశాలను పరిగణించడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా.. సంస్థను రివ్యూ చేసి...