Hyderabad, ఏప్రిల్ 9 -- Telugu Serials: ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలాంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే సుదీర్ఘ కాలంగా వందల ఎపిసోడ్లుగా సాగుతున్న మరికొన్ని సీరియల్స్ కూడా ముగింపుకు వచ్చేస్తున్నాయి. అలా ఈ ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు సీరియల్స్ ముగియబోతున్నాయి.

ఏప్రిల్ నెలలోనే శుభం కార్డు పడనున్న సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీకి చెందిన సీరియల్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క ఈటీవీ ఛానెల్లోనే మూడు సీరియల్స్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పనున్నాయి. ఈ ఛానెల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చే వసంత కోకిల సీరియల్ ఈ నెలలోనే ముగియనుంది. ఏప్రిల్ 19 లేదా ఆ తర్వాతి వారం ఈ సీరియల్ కు శుభం కార్డు పడనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదే ఛానెల్లో వచ్చే మరో సీరియల్ నేను శైలజ కూడా చివరికి వచ్చేసింది. గతంలో లా...