భారతదేశం, ఫిబ్రవరి 28 -- పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ప్రతినిధి 2 మంచి క్రేజ్‍తో వచ్చింది. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది మే 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఈ పొలిటికల్ మూవీ రావడం ఆసక్తిని పెంచింది. మంచి సక్సెస్ అయిన ప్రతినిధి చిత్రానికి సుమారు పదేళ్లకు సీక్వెల్‍గా రావటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ప్రతినిధి 2 ఆ రేంజ్‍లో కలెక్షన్లను దక్కించుకోలేకపోయంది. ఇప్పుడు ఈ సినిమా రెండో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ప్రతినిధి 2 చిత్రం నేడు (ఫిబ్రవరి 28) సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగన్నర నెలల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రతినిధి 2. ఇప్పుడు అందుకు ...