భారతదేశం, ఫిబ్రవరి 7 -- ప్రేమలో ఉన్న వారికి ప్రత్యేకమైన వాలెంటైన్స్ వీక్ నేడు (ఫిబ్రవరి 7 ) మొదలైపోయింది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే వరకు ఈ ప్రేమికుల వారం కొనసాగనుంది. ప్రేమలో ఉన్న వారిది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీలా ఉంటుంది. అందుకే తెలుగులో ప్రేమకథలతో వేలాది సినిమాలు వచ్చాయి. చాలా లవ్ స్టోరీ చిత్రాలు బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. క్లాసిక్‍లుగా నిలిచాయి. ఈ వాలెంటైన్స్ వీక్‍లో లవ్ స్టోరీలతో ఉండే చిత్రాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. అందుకే ఈ వారం రోజుకో చిత్రం చూసేందుకు ఏడు ఆప్షన్లు ఇక్కడ చూడండి. ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకోండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఆర్య (2004) చిత్రం క్లాసిక్ లవ్ మూవీగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‍బస్టర్ అయింది. అల్లు అర్జున్‍కు స్టైలిష్ స్...