భారతదేశం, ఏప్రిల్ 8 -- యువ నటుడు అంకిత్ కొయ్య, శ్రీయా కొంతం హీరోహీరోయిన్లుగా నటించిన '14 డేస్ - గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో' సినిమా ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. థియేటర్లలో అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ సక్సెస్ కాలేదు. అయితే, ఓటీటీలో ఈ 14 డేస్ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సినిమాల ట్రెండింగ్ లిస్టులోకి వచ్చేసింది. ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 4) ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టింది. మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‍లోకి వచ్చింది లోబడ్జెట్ కామెడీ చిత్రం.

14 డేస్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్...