భారతదేశం, ఫిబ్రవరి 25 -- Telangana student suicide: ఐఐటీ పాట్నాలోని అమ్హారా (బిహ్తా) క్యాంపస్ ఆవరణలో బీటెక్ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) మూడో సంవత్సరం చదువుతున్న తెలంగాణాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తానుంటున్న హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

ఈ ఘటన అనంతరం ఐఐటీ పాట్నా క్యాంపస్ లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో, క్యాంపస్ లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బాధిత విద్యార్థి తెలివైన స్టూడెంట్ అని, ఘటనకు ముందు రోజు మామూలుగా ప్రవర్తించాడని సహ విద్యార్థులు తెలిపారు.

మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన జరిగిందని, మధ్యాహ్నం...