భారతదేశం, ఫిబ్రవరి 6 -- రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మరో నిర్ణయంపై కసరత్తు చేస్తోంది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన దస్త్రం. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

సాధారణంగా ఒక వ్యక్తికి ఓ వాహనం ఉన్న తర్వాత. మరో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్సాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటోంది. అయితే ఈ ట్యాక్స్ ను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ అయితే వాహనదారులకు మరో ఊరట దక్కినట్లే అవుతుంది.

రవాణశాఖ గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో ఏటా సగట...