భారతదేశం, మార్చి 8 -- టెక్నో తన లేటెస్ట్​ కామన్ 40 సిరీస్​ని లాంచ్​ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో నాలుగు మోడళ్లు ఉన్నాయి. అవి.. కామన్ 40 ప్రీమియర్ 5జీ, కామన్ 40ప్రో 5జీ, కామన్ 40ప్రో, కామన్ 40. అడ్వాన్స్​డ్​ ఏఐ ఫీచర్లు, కొత్త వన్ ట్యాప్ బటన్, 50 మెగాపిక్సెల్ సెన్సార్లతో మెరుగైన సెల్ఫీ కెమెరాలు ఈ ఫోన్లలో ఉన్నాయి. త్వరలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ టెక్నో కామన్​ 40 సిరీస్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టెక్నో కామన్ 40, కామన్ 40ప్రో స్మార్ట్​ఫోన్స్​ ఎంట్రీ లెవల్ ఆప్షన్లు. రెండూ 4జీ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్, 6.78 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, ఫుల్ హెచ్​డీ+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రెండు మోడళ్లలో 45వాట్ ఫాస్ట్ ఛ...