భారతదేశం, ఏప్రిల్ 10 -- TDP Vs Ysrcp: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ కుమార్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాప్తాడులో జగన్మోహన్‌ రెడ్డి పోలీసులను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ కార్యకర్త అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు. జగన్‌ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేవాడు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.

మహిళల్ని కించపరిచేలా కామెంట్లు చేసిన ఐటీడీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ అధిష్టానం అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం ఆదేశించడంతో అతడిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్...