భారతదేశం, ఫిబ్రవరి 20 -- Tata Safari and Tata Harrier Stealth edition: టాటా మోటార్స్ తన హారియర్, సఫారీ ఎస్యూవీ ల కొత్త స్టెల్త్ ఎడిషన్ లను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో టీజ్ చేసింది. ఈ రెండు ఎడిషన్లు ఫిబ్రవరి 21వ తేదీన లాంచ్ అవనున్నట్లు ఆ వీడియోలో సంకేతాలిచ్చింది. అయితే, ఈ రెండు ఎస్యూవీలు కొనుగోలు చేయడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, దీని కోసం బుకింగ్ లను కూడా ప్రారంభించామని టాటా డీలర్ షిప్ లు ధృవీకరించాయి.

టాటా మోటార్స్ సోషల్ మీడియాలో టీజ్ చేసిన వీడియోలో 'మ్యాట్ బ్లాక్', 'లిమిటెడ్ ఎడిషన్' గురించి కూడా ప్రస్తావించారు. ఈ వేరియంట్లు ప్రత్యేక పెయింట్ స్కీమ్ లు, ఇతర కలెక్టర్ ఎడిషన్ టచ్ లను కలిగి ఉంటాయి. స్టెల్త్ ఎడిషన్ లో ఎటువంటి యాంత్రిక మార్పులు ఉండవు. కాని డార్క్ ఎడిషన్ మోడళ్ల మాదిరిగా కాస్మెటిక్ అప్ డేట్స్ ఉంటాయి.

టాటా మోటార్స్ కొత...