భారతదేశం, జనవరి 28 -- టాటా నెక్సాన్ ఐసీఎన్జీ రెడ్ డార్క్ ఎడిషన్ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. రూ.12.70 లక్షల ప్రారంభ ధరతో ఈ ఎస్​యూవీ లాంచ్​ అయ్యింది. క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్ పీఎస్, ఫియర్లెస్ ప్లస్ పీఎస్ అనే మూడు వేరియంట్లలో ఈ మోడల్​ లభిస్తుంది. చివరి రెండు వేరియంట్ల ధరలు రూ.13.70 లక్షలు, రూ.14.70 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సబ్ కాంపాక్ట్ సీఎన్జీ ఎస్​యూవీతో పోల్చితే తాజాగా మార్కెట్​లోకి వచ్చిన రెడ్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్, క్రియేటివ్ + పిఎస్ వేరియంట్ల ధరలు సుమారు రూ .40,000, ఫియర్లెస్ + వేరియంట్​ రూ .20,000 అధికం.

టాటా నెక్సాన్ ఐసీఎన్జీ​ రెడ్ డార్క్ ఎడిషన్ ఆల్ బ్లాక్ ఎక్స్​టీరియర్ పెయింట్ షేడ్​ని పొందుతుంది. ఇందులో అట్లాస్ బ్లాక్ బాడీ కలర్, ఫ్రంట్ గ్రిల్,...