భారతదేశం, మార్చి 18 -- ఇండియన్​ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లోని బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో టాటా నెక్సాన్​ ముందు వరుసలో ఉంటుంది.​ నెక్సాన్ శ్రేణి 2023లో కొత్త డిజైన్, ఫీచర్లతో పూర్తిస్థాయిలో అప్డేట్​ అయ్యింది. ఇక 2025లోనూ నెక్సాన్ లైనప్ చిన్న ఫీచర్ చేర్పులు, కొత్త కలర్ ఆప్షన్స్​తో మరొక మైనర్​ అప్డేట్​ని అందుకుంది. 2025 టాటా నెక్సాన్ ప్రారంభ ధర ఇప్పుడు రూ .7.99 లక్షల నుంచి రూ .14.79 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. అయితే టాటా నెక్సాన్​ క్రియేటివ్​ + పీఎస్​ వేరియంట్​.. ఒక వాల్యూ బైగా మార్కెట్​లో చూస్తున్నారు. ఇది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఎందుకో ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్ ఎస్​యూవీ లైనప్ స్మార్ట్ ట్రిమ్ స్థాయిలతో ప్రారంభమై ఫియర్లెస్ + డీటీ ట్రిమ్ స్థాయి వరకు వెళుతుంది. క్రియేటివ్ ప్లస్ పీఎస్ పెట్రోల్ మాన్యువల్ ట...