భారతదేశం, ఫిబ్రవరి 20 -- దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​ మరో మైలురాయిని అధిగమించింది. దేశ ఈవీ సెగ్మెంట్​లో అధిక మార్కెట్​ షేరు కలిగి ఉన్న టాటా మోటార్స్​.. 2 లక్షల సేల్స్​ మైలురాయిని టచ్​ చేసింది. దీనిని సెలబ్రేట్​ చేసుకునేందుకు కస్టమర్స్​కి 'స్పెషల్​' బెనిఫిట్స్​ని ప్రకటించింది టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ విభాగం టాటా ప్యాసింజర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ. ఇప్పటికే ఉన్న కస్టమర్స్​తో పాటు రానున్న 45 రోజుల్లో చేరే కొత్త కస్టమర్స్​కి వర్తిస్తుందని సంస్థ చెప్పింది. ఈ నేపథ్యంలో టాటా ఈవీ స్పెషల్​ బెనిఫిట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అన్ని ఈవీ మోడళ్లు కలుపుకుని రెండు లక్షల అమ్మకాల మైలురాయిని పురస్కరించుకుని.. టాటా వినియోగదారుల కోసం అనేక ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది సంస్థ. ఎక్స్​ఛేంజ్ బోనస్, 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్స్ ఆప్షన్లు...