భారతదేశం, సెప్టెంబర్ 6 -- టాటా మోటార్స్​ నుంచి బిగ్​ అప్డేట్​! కేంద్రం జీఎస్టీని తగ్గించడంతో, ఆ బెనిఫిట్​ని కస్టమర్లకు పూర్తిగా పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తన పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను గరిష్ఠంగా రూ. 1.55లక్షల వరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు సెప్టెంబర్​ 22 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అదే రోజు సవరించిన జీఎస్టీ రేట్లు కూడా అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్​ కార్లు, వాటిపై తగ్గిన ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్ లిమిటెడ్ అండ్​ టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "సెప్టెంబర్ 22, 2025 నుంచి ప్రయాణికుల వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అమలులోకి రావడం సకాలంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం! ఇది భారతదే...