భారతదేశం, అక్టోబర్ 13 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో టాటా క్యాపిటల్​ లిస్టింగ్​ సోమవారం ఫ్లాట్​గా జరిగింది. ఇష్యూ ప్రైజ్ రూ. 326​తో పోల్చితే ఎన్​ఎస్​ఈలో టాటా క్యాపిటల్​ షేరు ధర 1.22శాతం పెరిగి రూ. 330 వద్ద ఓపెన్​ అయ్యింది. బీఎస్​ఈలో సైతం అదే ప్రైజ్​కి లిస్ట్​ అయ్యింది.

బ్రోకరేజీ సంస్థలైన ఎమ్‌కే గ్లోబల్, జేఎం ఫైనాన్షియల్ ఈ టాటా క్యాపిటల్​కి 'యాడ్' రేటింగ్‌తో కవరేజీని ప్రారంభించాయి. టాటా క్యాపిటల్ షేర్ల కోసం వారు నిర్దేశించిన టార్గెట్ ధర రూ. 360గా ఉంది! ప్రస్తుత ధరతో పోలిస్తే, ఇక్కడి నుంచి లాభాలు పరిమితంగా ఉంటాయని ఇది సూచిస్తోంది.

టాటా గ్రూప్ మాతృసంస్థ బలం, బ్రాండ్ పేరు కీలకం కావడం.

విభిన్న ఉత్పత్తుల శ్రేణి, విస్తృత భౌగోళిక చేరువ, వివిధ నిధుల వనరుల కారణంగా రిస్క్ తక్కువగా ఉండటం.

క్రెడిట్ ఖర్చులు, ఆపరేటింగ్ లీవరేజ్ మెరుగుపడటం వల్ల, 2028 ఆర...