భారతదేశం, మార్చి 9 -- టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్​లో ఉన్న ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లలో ఒకటి. దీనికి మంచి డిమాండ్​ కూడా ఉంది. ఇది హ్యుందాయ్ ఐ20, మారుతీ సుజుకీ బాలెనో, టయోటా గ్లాంజా, మారుతీ సుజుకీ స్విఫ్ట్ వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది. ఇక ఇప్పుడు టాటా మోటార్స్ ప్రస్తుతం ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​కి ఫేస్​లిఫ్ట్ వర్షెన్​ని సిద్ధం చేస్తోంది. ఈ మోడల్​కి సంబంధించి ఇప్పటికే రోడ్ టెస్ట్​లు ప్రారంభించినట్టు సమాచారం.

దేశీయ ఆటో దిగ్గజం టాట మోటార్స్​.. ఆల్ట్రోజ్​ని ఐదేళ్ల క్రితం భారత మార్కెట్​లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి, ఈ ప్రీమియం హ్యాచ్​బ్యాక్ గణనీయమైన అప్డేట్స్​ని పొందలేదు. ఇప్పుడు వాహన తయారీదారు ఈ కారు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్స్​ని తీసుకొస్తోంది. ఫేస్​లిఫ్ట్ ఆల్ట్రోజ్ లాంచ్ టైమ్​లైన్ గురించి టాటా మోటార్స్ ఎలాంటి వివరాలన...