భారతదేశం, మార్చి 9 -- దశాబ్ద కాలంగా అల్లకల్లోలాలు, రక్తపాతానికి కేరాఫ్​ అడ్రెస్​గా మారిన సిరియా.. హింసాత్మక ఘర్షణలతో మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు బషర్​ అల్​ అసద్​ మద్దతుదారులు- భద్రతా దళాల మధ్య రెండు రోజులు పాటు సాగిన ఘర్షణల్లో 1000కిపైగా మంది మరణించారు. ఈ పరిస్థితుల మధ్య అనేక నగరాల్లోని వీధులపై మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ హింసకు ముగింపు పడిందని అధికారులు చెబుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళకరంగానే ఉన్నట్టు సమాచారం.

సిరియాలో ఇటీవలే అధికారం మారిన విషయం తెలిసిందే. కాగా మాజీ అధ్యక్షుడు బషర్​ అసద్​కి నమ్మకస్తులుగా పేరు సంపాదించుకున్న మైనారిటీ అలవైట్​ ప్రజలను ఇప్పుడు టార్గెట్​ చేశారు. ఆ అలవైట్​లకు అసద్​ పాలనలో అనేక పవర్స్​ ఉండేవి. అనేక టాప్​ ర్యాంకుల్లో వారు ఉండేవారు. చాలా విశాలవంతమైన జీవితాలు గడిపినవారు కూడా ఉన...