భారతదేశం, మార్చి 8 -- దేశ రాజధాని దిల్లీ- ఎన్​సీఆర్​ ప్రాంతంలో స్వైన్​ ఫ్లూ కేసులు ఆందోళకర రీతిలో పెరుగుతున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఆయా ప్రాంతాల్లోని 54శాతం ఇళ్లల్లో కనీసం ఒక్కరికైనా స్వైన్​ఫ్లూ (హెచ్​1ఎన్​!) లక్షణాలు కనిపిస్తున్నాయి! ప్రజలు తీవ్ర జ్వరం, గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్​ 19 తరహాలోనే ఉన్న ఈ లక్షణాల కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఫలితంగా ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితులు చూసి అందరు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సీజనల్​ వ్యాధులు పెరుగుతుండటం, వాయు నాణ్యత కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనూహ్య మార్పులు...