భారతదేశం, సెప్టెంబర్ 7 -- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తన మొదటి వార్షిక సేల్‌ను ప్రకటించింది! 'ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూవ్‌మెంట్ 2025' పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ దేశంలోనే "అతి వేగవంతమైన సేల్" అని కంపెనీ పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా, ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది.

ఈ స్విగ్గీ ఇన్​స్టామార్ట్​ వార్షిక సేల్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ ప్రకటన చాలా ఆసక్తికరంగా ఉంది! ఎందుకంటే, అమెజాన్- ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా ఇంచుమించు అదే సమయంలో తమ వార్షిక సేల్స్​ని తీసుకొస్తున్నాయి. అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్, ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ రెండూ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి.

క్విక్​ డెలివరీ కారణంగా స్విగ్గీ ఇన్​స్టామార్ట్​కి ఎడ్జ్​ ఉండే అవకాశం లేకప...