భారతదేశం, ఆగస్టు 19 -- ఆటోమొబైల్​ దిగ్గజం మారుతీ సుజుకీ.. కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎస్‌యూవీకి మారుతీ సుజుకీ ఎస్కుడో అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ మోడల్​ సెప్టెంబర్​ 3న ఇండియాలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్​లోకి వచ్చిన తర్వాత.. ఇది హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతీ సుజుకీ ఈ ఎస్‌యూవీని తన అరేనా డీలర్‌షిప్ ఛానెల్ ద్వారా విక్రయించనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

లెవెల్-2 అడాస్​: రాబోయే మారుతీ సుజుకీ ఎస్‌యూవీ ఎస్కుడోలో లెవెల్-2 అడాస్​ (అటానమస్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ అందుబాటులో ఉండనుంది. అరేనా మోడల్స్​లో ఈ ఫీచర్‌ను అందిస్తున్న తొలి మారుతీ కారు ఇదే అవుతుంది.

డాల్బీ అట్మాస్ టెక్నాలజీ: మహీంద్రాకు చెందిన ఎక్స్‌...