భారతదేశం, మార్చి 17 -- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలకు పైగా చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు తిరిగి భూమి మీదకు రావడంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) బిగ్​ అప్డేట్​ ఇచ్చింది! ఇద్దరు వ్యోమగాములు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు ఫ్లోరిడా తీరం వద్ద దిగనున్నారు. ఇది భారత కాలమానం ప్రకారం బుధవారం అవుతుంది.

ఆదివారం తెల్లవారుజామున ఐఎస్ఎస్​కి చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్​లో మరో అమెరికన్ వ్యోమగామి, రష్యా వ్యోమగామితో కలిసి బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్​ స్వదేశానికి తిరిగిరానున్నారు.

గత ఏడాది జూన్ నుంచి సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​ ఐఎస్​ఎస్​లో ఉన్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్​లైనర్​ని పరీక్షించిన తొలి వ్యోమగా...