భారతదేశం, మార్చి 18 -- అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించి, ఎన్నో రికార్డులు సాధించిన సునితా విలియమ్స్​ ఒక భారత సంతతి మహిళ కావడం భారతీయులకు నిజంగా గర్వకారణం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, సునితా మాత్రం తన మూలాలను మర్చిపోలేదు. అంతరిక్షంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన ఆమె, ఇంకొన్ని గంటల్లో భూమి మీదకు తిరిగి వస్తున్న నేపథ్యంలో భారత్​లోని ఒక చిన్న గ్రామంతో సునితా విలియమ్స్​కి ఉన్న పెద్ద కనెక్షన్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

1965 సెప్టెంబర్​ 19న అమెరికా ఓహాయోలోని యూక్లిడ్​లో జన్మించారు సునితా విలియమ్స్​. ఆమె తండ్రి పేరు దీపక్​ పాండ్య. ఆయన గుజరాత్​లో ఒక న్యూరోసైంటిస్ట్​. 1957లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. అక్కడే స్లొవీన్​ అమెరికన్​ ఉర్సులీన్​ బానీని కలిసి, వివాహం చేసుకున్నారు.

అయితే, సునితా విలియమ్స్​ తండ్రి స్వస్థలం గుజరాత్​లోని ఝులసన్​ అనే చిన్న గ...