భారతదేశం, మార్చి 19 -- Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరారు. నిర్దేశించిన సమయం కంటే అధికంగా 9 నెలల పాటు ఐఎన్‌ఎస్‌లో చిక్కుకుపోయిన వ్యామోగాములు సురక్షితంగా భూమికి చేరారు.

తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా, విల్మోర్‌ తర్వాత భూమికి తిరిగి వచ్చారు. నాసా వ్యోమగాములైన అమెరికన్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి సునీతా, విల్మోర్‌లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు) ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగారు.

వారు ప్రయాణించిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్, 'ఫ్రీడమ్' భూవాతావరణం గుండా ప్రయాణించి, సుమారు 3,000 డిగ్రీల ఫారెన్ హీట్ (1650 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతలను తట్ట...