భారతదేశం, ఫిబ్రవరి 19 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 29 పాయింట్లు పడి 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 14 పాయింట్లు కోల్పోయి 22,945 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 49,087 వద్దకు చేరింది.

"23,150 కన్నా దిగువన ఉన్నంత వరకు నిఫ్టీ50లో సెల్​ ఆన్​ రైజ్​ కనిపించొచ్చు. 22,800 వద్ద సపోర్ట్​ ఉంది. 23000 లెవల్స్​ వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది," అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ డే తెలిపారు.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4786.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3072.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 28,334.7 కోట్లు విలువ చ...