భారతదేశం, మార్చి 25 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1079 పాయింట్లు పెరిగి 77,984 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 308 పాయింట్లు పెరిగి 23,658 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1111 పాయింట్లు వృద్ధిచెంది 51,705 వద్దకు చేరింది.

"23,600 వద్ద ఉన్న రెసిస్టెన్స్​ని నిఫ్టీ50 బ్రేక్​ చేసి పైకి వెళ్లింది. ఫలితంగా నిఫ్టీలో ట్రెండ్​ స్ట్రాంగ్​ పాజిటివ్​గా ఉంది. 23,500 వద్ద సపోర్ట్​ కనిపిస్తోంది. దానికన్నా కిందకు వెళితే స్వల్ప కరెక్షన్​ ఎదుర్కోవచ్చు," అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ డే తెలిపారు.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3055.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 98.54 కోట్లు విలువ చేసే షేర్...