భారతదేశం, మార్చి 28 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 318 పాయింట్లు పెరిగి 77,606 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 105 పాయింట్లు పెరిగి 23,592 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 367 పాయింట్లు వృద్ధిచెంది 51,576 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 23,850 దగ్గర కీలక రెసిస్టెన్స్​, 23,400 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. ఈ రెండింటిలో ఏది బ్రేక్​ అయినా మంచి మూమెంట్​ కనిపిస్తుంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 11,111.25 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2517.70 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సె...