భారతదేశం, మార్చి 13 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 73 పాయింట్లు పడి 74,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 27 పాయింట్లు కోల్పోయి 22,470 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 48,056 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 22,300 లెవల్స్​ వద్ద బలమైన సపోర్ట్​ ఉంది. అది సపోర్ట్​ ఇస్తే.. సూచీ 22,600- 22,650 వరకు వెళ్లొచ్చు. కానీ 22,300 లెవల్స్​ కన్నా దిగువకు వెళితే మాత్రం మరింత నష్టాలు చూడవచ్చు," అని కొటాక్​ సెక్యూరిటీస్​ హెడ్​ ఈక్విటీ రీసెర్చ్​ శ్రీకాంత్​ చౌహాన్​ తెలిపారు.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1627.61 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1510.35 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

మార్చ్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరక...