భారతదేశం, ఫిబ్రవరి 25 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో నష్టాల పరంపర కొనసాగుతోంది! సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​, నిఫ్టీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 857 పాయింట్లు పడి 74,454 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 243 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 329 పాయింట్లు పడి 48,651 వద్దకు చేరింది.

"నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా ఉంది. 22400 సపోర్ట్​ కూడా బ్రేక్​ అయితే నిఫ్టీ మరింత కిందకి వెళ్లొచ్చు. 22,750 వద్ద రెసిస్టెన్స్​ ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.​

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6286.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5185.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఫిబ...