భారతదేశం, ఫిబ్రవరి 20 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 28 పాయింట్లు పడి 75,939 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు కోల్పోయి 22,933 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 483 పాయింట్లు పెరిగి 49,570 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 22,800 లెవల్స్​ వద్ద బలమైన సపోర్ట్​ ఉంది. పరిస్థితులు కాస్త మెరుగుపడుతుండటంతో నిఫ్టీ50 23,235 వద్ద ఉన్న కీలక రెసిస్టెన్స్​ వరకు వెళ్లొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ అండ్​ డెరివేటివ్​ ఎనలిస్ట్​ వినయ్​ రజని తెలిపారు.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1881.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1957.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు...