భారతదేశం, ఫిబ్రవరి 18 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 58 పాయింట్లు పెరిగి 75,997 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు వృద్ధిచెంది 22,959 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 49,259 వద్దకు చేరింది.

"నిఫ్టీ50 22800 లెవల్స్​ కన్నా పైన ఉన్నంత కాలం పుల్​బ్యాక్​ ఫార్మేషన్​ని చూడవచ్చు. నిఫ్టీ50 23000 వరకు వెళ్లొచ్చు. 22725-22650 లెవల్స్​ వద్ద సపోర్ట్​ ఉంది," అని కొటాక్​ సెక్యూరిటీస్​ ఈక్విటీ రీసెర్చ్​ హెడ్​ శ్రీకాంత్​ చౌహాన్​ తెలిపారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3937.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4759.77 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చే...