భారతదేశం, సెప్టెంబర్ 10 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 95 పాయింట్లు వృద్ధిచెంది 24,869 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 54,216 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,041.95 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 176.35 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

"నిఫ్టీ50లో ట్రెండ్​ పాజిటివ్​గా కొనసాగుతోంది. 24,900-25,000 లెవల్స్​ కీలక రెసిస్టెన్స్​గా ఉంది. సపోర్ట్​ 24,750 వద్ద ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని...