భారతదేశం, ఫిబ్రవరి 4 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 319 పాయింట్లు పడి 77,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పడి 23,361 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 296 పాయింట్లు కోల్పోయి 49,211 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​.. పాజిటివ్​గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్​ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్​ ఉంది.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3958.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2708.23 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

జనవరి​​ నెల మొత్తం మీ...