భారతదేశం, జనవరి 27 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 330 పాయింట్లు పడి 76,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 113 పాయింట్లు కోల్పోయి 23,092 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 221 పాయింట్లు పడి 48,368 వద్దకు చేరింది.

"గత నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి నిఫ్టీ50 23000 - 23400 విస్తృత శ్రేణిలో ట్రేడవుతోంది. నిఫ్టీ50 23050 - 23000 సపోర్ట్​ జోన్​ దాటనంత వరకు, రేంజ్​బౌండ్​ ప్రైజ్​ యాక్షన్​ కొనసాగుతుందని మనం ఆశించవచ్చు," అని మిరే అసెట్ షేర్ఖాన్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ గెడియా తెలిపారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,758.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2402.31 కోట...