భారతదేశం, మార్చి 15 -- గతేడాది రెండో భాగం నుంచి దేశీయ స్టాక్​ మార్కెట్​లు విపరీతమైన నష్టాలను చూస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు భారీ మొత్తంలో నష్టపోయాయి. అయితే, మార్కెట్​లు డౌన్​లో ఉన్న కొన్ని కంపెనీల స్టాక్స్​ మాత్రం లాభాల్లో దూసుకెళుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి శుక్ర ఫార్మాస్యూటికల్స్​! ఈ కంపెనీ షేర్లు 6 నెలల్లో ఏకంగా 285.9శాత రిటర్నులు ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మరొక బిగ్​ అప్డేట్​ వచ్చింది. శుక్ర ఫార్మా కంపెనీ స్టాక్​ స్ల్పిట్​ని ప్రకటించింది. కంపెనీ షేర్లను 10 భాగాలుగా విభజిస్తారు. ఈ స్టాక్ డివిజన్​ తర్వాత కంపెనీ షేరు ముఖ విలువ రూ.1కి పడిపోతుంది. కంపెనీ స్టాక్ విభజనకు రికార్డు తేదీని సైతం ప్రకటించింది. ఆ వివరాలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో శుక్ర ఫార్మా షేరు రూ. 245.8 వద్ద అప్పర్​ సర్క...