భారతదేశం, మార్చి 26 -- Stock market today: ఏడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మార్చి 26, బుధవారం 700 పాయింట్లకు పైగా భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 729 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 77,288.50 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు లేదా 0.77 శాతం నష్టంతో 23,486.85 వద్ద ముగిశాయి. బిఎస్ ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.45 శాతం నష్టంతో, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం నష్టంతో ముగిశాయి.

బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.415 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.411 లక్షల కోట్లకు పడిపోవడంతో, ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు సుమారు రూ.4 లక్షల కోట్లు నష్టపోయారు. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ బ్యాంక్ 0.77 శాతం క్షీణించగా, పీఎస్ యూ బ్యాంక్ 1.19 శాతం, ప్రైవేట్ బ్యాంక్ 0.90 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్...