భారతదేశం, ఏప్రిల్ 1 -- ఈద్​ కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సోమవారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​​ని సూచీలు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 192 పాయింట్లు పడి 77,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 23,519 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 11 పాయింట్లు పతనమై 51,565 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,352.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,646.49 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మార్చ్​ నెలలోనూ ఎఫ్​ఐఐలు నెట్​ సెల్లర్లగానే ఉన్నారు. డీఐఐలు నెట్​ బయ్యర్స్​గా ఉన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 18 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"రోజువారీ చార్...