భారతదేశం, ఫిబ్రవరి 26 -- మహా శివరాత్రి నేపథ్యంలో నేడు దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు. సెన్సెక్స్​, నిఫ్టీలు బుధవారం మూతపడి ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన హాలిడే షెడ్యూల్ ప్రకారం మిడ్ వీక్ విరామం తర్వాత ట్రేడింగ్​ కార్యకలాపాలు గురువారం పునఃప్రారంభమవుతాయి.

2025 మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ నిలిపివేయనున్నారు. అయితే, కమోడిటీ మార్కెట్ ఉదయం సెషన్​లో మూతపడి, సాయంత్రం 5:00 గంటలకు ట్రేడింగ్ కోసం తిరిగి ఓపెన్​ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.

అంటే ఫిబ్రవరి 26న ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్, ఎస్ఎల్బీ విభాగాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు. దీంతోపాటు భారత స్టాక్ మార్కెట్​లో కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సైతం నిలిచిపోనుంది. ముందుగా చెప్పినట్లుగా కమోడిటీ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల నుంచ...