భారతదేశం, సెప్టెంబర్ 28 -- నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ విడుదల చేసిన అధికారిక ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025 అక్టోబర్‌లో స్టాక్​ మార్కెట్‌లకు మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీనితో పాటు దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.

అక్టోబర్ 2 (బుధవారం): మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగ సందర్భంగా సెలవు.

అక్టోబర్ 21 (సోమవారం): దీపావళి, లక్ష్మీ పూజ సందర్భంగా సెలవు (ముహురత్​ ట్రేడింగ్​ ఉంటుంది).

అక్టోబర్ 22 (మంగళవారం): దీపావళి పండుగ (బలిప్రతిపద) సందర్భంగా సెలవు.

ఈ మూడు రోజులు మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​), కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు కూడా మూసి ఉంటాయి.

అక్టోబర్ తర్వాత 2025లో స్టాక్ మార్కెట్‌కు ఉన్న ఇతర ముఖ్య సెలవులు:

నవంబర్ 5: ప్రకాష్ గురుపర్బ్ (శ్రీ గురు నానక...