భారతదేశం, ఫిబ్రవరి 24 -- గతేడాది అక్టోబర్​లో మొదలైన స్టాక్​ మార్కెట్​ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. ట్రేడింగ్​ సెషన్​ మొదలవుతుందంటేనే మదుపర్లు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. వీటి మధ్య సోమవారం ట్రేడింగ్​ సెషన్​లోనూ సెన్సెక్స్​, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 10:45 సమయానికి సెన్సెక్స్​ 731 పాయింట్లు పడి 74,580 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50 225 పాయింట్లు కోల్పోయి 22,571 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ స్టాక్​ మార్కెట్​ల పతనానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాము..

1. విస్తృత వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారీఫ్ విధానాల కారణంగా, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న విభేదంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ టారిఫ్ చర్యలు విస్తృత వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస...