భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లపై 'ట్రంప్​' పిడుగు పడింది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వివిధ దేశాలపై టారీఫ్​లు విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లతో పాటు దేశీయ సూచీలు సెన్సెక్స్​, నిఫ్టీ సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో క్రాష్​ అయ్యాయి. రూపాయి సైతం ఆల్​-టైమ్​ లోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​ పతనానికి కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

శనివారం ట్రేడింగ్​ సెషన్​లో 77,506 వద్ద క్లోజ్​ అయిన సెన్సెక్స్​.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో 77,064 వద్ద ఓపెన్​ అయ్యింది. అనంతరం 76,756 వద్ద ఇంట్రాడే- లో ని హిట్​ చేసి ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 500 పాయింట్ల నష్టంతో 77,007 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఇక నిఫ్టీ50.. శనివారం 23,482 వద్ద క్లోజ్​ అయ్యి, సోమవారం 23,319 వద్ద ఓప...