భారతదేశం, ఏప్రిల్ 7 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రవేశపెట్టిన టారీఫ్​లు ప్రపంచ స్టాక్​ మార్కెట్​లను దెబ్బతీశాయి. అదే సమయంలో అమెరికా మీద చైనా టారీఫ్​లను ప్రకటించడంతో ప్యానిక్​ సెల్లింగ్​ ట్రిగ్గర్​ అయ్యింది. ఫలితంగా అమెరికా స్టాక్​ మార్కెట్​లలో మొదలైన పతనం, ఇప్పుడు యూరోప్​ నుంచి ఆసియా వరకు విస్తరించింది. 'బ్లాక్​ మండే' హెచ్చరికల మధ్య ఆసియాలోని అనేక స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ పతనాన్ని చూస్తున్నాయి. జపాన్​ నిక్కీలో వచ్చిన నష్టాలకు ఏకంగా ట్రేడింగ్​నే సస్పెండ్​ చేశారు! ఇటు భారత స్టాక్​ మార్కెట్​లు కూడా భారీ నష్టాల్లో ఓపెన్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వివిధ దేశాలపై ట్రంప్​ టారీఫ్​లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం సాయంత్రం అమెరికాపై చైనా భారీ మొత్తంలో టారీఫ్​ని విధిస్తున్నట్టు ప్రకటించింది. ...