భారతదేశం, ఏప్రిల్ 1 -- 'ట్రంప్​ టారీఫ్​​' ప్రభావంతో దేశీయ స్టాక్​ మార్కెట్​ మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో పతనమైంది. వివిధ దేశాలపై ఏప్రిల్​ 2న సుంకాలను ప్రకటిస్తానని ట్రంప్​ తేల్చిచెప్పడంతో, అందుకు ఒక రోజు ముందే సెన్సెక్స్​, నిఫ్టీలు క్రాష్​ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బీఎస్​ఈ సెన్సెక్స్​ 1,312 పాయింట్ల నష్టంతో 76,103 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 324 పాయింట్లు కోల్పోయి 23,195 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్​ మార్కెట్​ ఫాల్​కి గల కారణాలను నిపుణులు వెల్లడించారు. అవి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్​లో విడుదల చేయబోయే టారిఫ్ రోలౌవుట్ ప్లాన్​పై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. వాషింగ్టన్​లోని వైట్​హౌస్ రోజ్ గార్డెన్​లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ట్రంప్ తన రెసిప్రోకల్​ టారిఫ్ ప్రణా...