భారతదేశం, మార్చి 24 -- భారత స్టాక్​ మార్కెట్​లలో 'మార్వలెస్​ మండే'! దాదాపు ఆరు నెలలుగా దేశీయ స్టాక్​ మార్కెట్​లో నష్టాల పరంపరను చూసి, తట్టుకున్న ఇన్వెస్టర్లకు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ద్వారా మంచి రివార్డు లభించింది. సెన్సెక్స్​, నిఫ్టీ50, బ్యాంక్​ నిఫ్టీ, స్మాల్​ క్యాప్​, మిడ్​క్యాప్​తో పాటు దాదాపు అన్ని ఇండెక్స్​లు భారీ లాభాల్లో ముగిశాయి. మరీ ముఖ్యంగా.. ఇయర్​ టు డేట్​ (వైటీడీ)లో నిఫ్టీ50, బ్యాంక్​ నిఫ్టీలు తొలిసారి గ్రీన్​లోకి రావడం ఇన్వెస్టర్స్​ని మరింత సంతోషపెట్టే విషయం. మరి దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి?

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 1.40శాతం పెరిగి 77,984.38 వద్ద ముగిసింది. వైటీడీలో లాభాల్లోకి వచ్చేందుకు సెన్సెక్స్​ ఇంకా 0.6శాతం పెరగాల్సి ఉంది.

నిఫ్టీ50 సైతం 1.39శాతం లాభపడి 23,658.35క...