భారతదేశం, ఏప్రిల్ 13 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లకు ఈ వారం తక్కువ ట్రడింగ్​ సెషన్స్​ ఉండనున్నాయి. ఏప్రిల్​ 14, 18 తేదీల్లో స్టాక్​ మార్కెట్​లకు సెలవులు ఉండనున్నాయి. అంబేడ్కర్​ జయంతి, గుడ్​ ఫ్రైడే ఇందుకు కారణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రేడర్లు, ఇన్వెస్టర్లు బీఎస్​ఈ వెబ్సైట్ - bseindia.com కి వెళ్లి పైన 'ట్రేడింగ్ హాలిడేస్' ఆప్షన్​పై క్లిక్ చేయాలి. 'ట్రేడింగ్ హాలిడేస్' ఆప్షన్​పై క్లిక్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ హాలిడేస్ 2025 లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ జాబితాలో ఏప్రిల్ 2025 లో మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 10న శ్రీ మహావీర్ జయంతి, 2025 ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, 18 ఏప్రిల్ 2025 గుడ్ ఫ్రైడే వంటి మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. అంటే ఈ వారంలో సోమవారం (14 ఏప్రిల్ 2025) శుక్రవారం (18 ఏ...