Hyderabad, మార్చి 13 -- Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ ఈ ఏడాది 9వ వారం రేటింగ్స్ లోనూ సత్తా చాటాయి. టాప్ 6లో అన్నీ ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. అయితే ఈ వారం రెండోస్థానం కోసం హోరాహోరీ పోటీ నెలకొనగా.. మరోసారి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది.

స్టార్ మా ఛానెల్ సీరియల్స్ విషయానికి వస్తే.. 9వ వారంలోనూ కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానంలోనే కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా అర్బన్, రూరల్ కలిపి 13.29 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో గుండె నిండా గుడి గంటలు నిలిచింది. ఈ సీరియల్ కు తాజా రేటింగ్స్ లో 12.21 రేటింగ్ నమోదవగా.. మూడోస్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు 12.19తో ఉంది. అంటే కేవలం 0.02తో రెండో స్థానాన్ని కోల్పోయింది.

నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 11.84 రేటింగ్ ...