Hyderabad, మార్చి 5 -- Star Maa New Serial: తెలుగులో టాప్ సీరియల్స్ కు పెట్టింది పేరైన స్టార్ మాలో సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు భానుమతి. తాజాగా ఈ సరికొత్త సీరియల్ ను ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది. అది కూడా ప్రైమ్ టైమ్ ప్రారంభమయ్యే సాయంత్రం 6 గంటలకు ఈ కొత్త సీరియల్ రానుండటం ఆసక్తి రేపుతోంది.

భానుమతి సీరియల్ వచ్చే సోమవారం (మార్చి 10) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానున్నట్లు స్టార్ మా ఛానెల్ వెల్లడించింది. ఇది చెదిరన కలా లేక ఓ కొత్త ఆశకు ఆరంభమా అంటూ భానుమతి మా ఇంటి మాలక్ష్మి సీరియల్ ను అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆ ఛానెల్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

"సీరియల్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు విలక్షణమైన కథతో పాటు వ్యవస్థపై నమ్మకం, సంప్రదాయాల పట్ల గౌరవం, పోరాటతత్వం వంటి విలువలతో కూడుకున్...