భారతదేశం, ఫిబ్రవరి 15 -- టాలీవుడ్‍లో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంటున్నారు. వరుసగా చిత్రాలు చేస్తున్నారు. అందం, అభినయం, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో అదరగొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‍కు చేరుకుంటున్నారు. ఇక బాలీవుడ్‍లోనూ తెలుగమ్మాయి శ్రీలీల అడుగుపెడుతున్నారు. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్‍తో మూవీ చేస్తున్నారు. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ నేడు (ఫిబ్రవరి 15) వచ్చేసింది.

కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ మ్యూజిక్, రొమాన్స్‌తో ఉంది. ఇద్దరూ ప్రేమికుల్లా నటిస్తున్నారు. ఎక్కువ గడ్డంతో కార్తీక్ ఆర్యన్ లుక్ రగెడ్‍గా ఉంది. ఈ చిత్రంలో సింగర్‌గా అతడు నటిస్తున్నారు. కార్తీక్ లవర్ పాత్రను శ్రీలీల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

ఈ మ...