భారతదేశం, మార్చి 30 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే హైప్ విపరీతంగా ఉంది. యానిమల్‍తో బ్లాక్‍బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో క్రేజ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. స్పిరిట్ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే నిరీక్షణ సాగుతోంది. ఈ తరుణంలో నేడు (మార్చి 30) ఉగాది సందర్భంగా ఈ మూవీ షూటింగ్ గురించి డైరెక్టర్ సందీప్ ఓ అప్‍డేట్ ఇచ్చారు.

స్పిరిట్ షూటింగ్ మెక్సికోలో జరగనుందని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అమెరికాలో జరిగిన ఉగాది వేడుకలకు హాజరైన ఆయన అప్‍డేట్ ఇచ్చారు. మెక్సికోలో షూటింగ్ లొకేషన్ల కోసం అన్వేషించామని సందీప్ రెడ్డి చెప్పారు.

దీంతో స్పిరిట్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మెక్సికోలో జరగనుందని అర్థమైపోయింది. త్వరలోనే చిత్రీకరణ మొదలుకానుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో ఇంటర్నేషనల్ రేంజ్...