భారతదేశం, ఫిబ్రవరి 3 -- Sonu Sood Charity: అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా సోనూ సూద్ ఫౌండేషన్‌ నాలుగు అంబులెన్సులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించింది. అంబులెన్స్‌లను ఇచ్చిన సోనూసూద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఆశయంలో 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' భాగస్వామి కావడంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నటుడిగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోనూ సూద్‌ కృతజ్...